![]() |
![]() |
.webp)
బుల్లితెర మీద ప్రియాంక జైన్ - శివ్ గురించి తెలియని వాళ్ళు లేరు. వాళ్ళు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారన్న విషయం కూడా వాళ్ళ వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ చూస్తే అర్ధమవుతుంది. అలాగే వాళ్ళ పేరెంట్స్, వీళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి రకరకాల ఫెస్టివల్స్ ని కూడా సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఐతే వీళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటార్రా బాబు అని ఆడియన్స్ తెగ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురుచూడటమే కాదు వీళ్ళు ఏ షోలో కనిపించినా ఏ షో ప్రోమోస్ కింద చూసినా "మీ పెళ్ళెప్పుడు" అనే మాట కూడా అడగకుండా ఉండరు. ఇక వీళ్ళు మాత్రం తొందరలో చేసుకుంటాం అని ఇప్పటికే చాలా షోస్ లో చెప్పుకొచ్చారు. ఇక ఆ "తొందరలో" అనేది ఎప్పుడో మాత్రం ఆడియన్స్ గెస్ చేయలేకపోతున్నారు.
రీసెంట్ గా ఒక షో ప్రోమోలో వీళ్ళ పెళ్లి గురించి ఒక క్లారిటీ ఇచ్చారు. ఫ్యామిలీ స్టార్స్ ప్రోమోలో న్యూ లవ్ వెర్సెస్ ఓల్డ్ లవ్ అనే కాన్సెప్ట్ తో ఈ షో రాబోతోంది. ఇందులో న్యూ లవర్స్ గా ప్రియాంక జైన్ - శివ్ వచ్చారు. 20 స్ లవ్ స్టోరీ అనే సెగ్మెంట్ లో ఇద్దరూ కలిసి ఒక సాంగ్ కి పెర్ఫార్మ్ చేశారు. ఆ తర్వాత ప్రియాంక "శివ్ నా లిప్ స్టిక్ తెచ్చావా ..నా బ్యాగ్ తెచ్చావా" అని అడిగింది. తెచ్చాను అని చెప్పాడు శివ్. ఇంతలో సుధీర్ "హలో హలో ఎక్స్క్యూజ్ మీ ఏదో ఇద్దరూ ఒకే ఇంట్లోంచి వస్తున్నట్టు..నా బ్యాగ్ తెచ్చావా ఇవి తెచ్చావా అని అడుగుతారేంటి" అన్నాడు. "ఒకే ఇంట్లోంచి వచ్చాము" అని చెప్పింది ప్రియాంక. "ఓహ్ పెళ్ళైపోయిందా" అన్నాడు సుధీర్. " ఒకే ఇంట్లో ఉండడానికి పెళ్ళవడానికి సంబంధం ఏమిటి" అని ఏమీ తెలీనట్టు అడిగాడు శివ్. "ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ పెళ్ళవలేదా" అన్నాడు సుధీర్ ఆశ్చర్యంగా. "అవును పెళ్ళవలేదు" అన్నారు శివ్-ప్రియాంక. "సరే ఇంతకు పెళ్ళెప్పుడు" అని సుధీర్ అడిగాడు. "ఏమన్నా టైం కుదిరితే చేసుకుందామని చూస్తున్నాం" అన్నారు శివ్ - ప్రియాంక. "వామ్మో ఇలాంటి ఒక ఆప్షన్ ఉందని కూడా నాకు తెలీదు" అన్నాడు సుధీర్. "మీకు తెలీకుండా కూడా ఉంటుందా" అని సుధీర్ మీద కౌంటర్ వేసింది ప్రియాంక. ఇక పక్కన కూర్చున్న అష్షు రెడ్డి ఐతే "నిజంగా డైలాగ్ బాగుంది" అంటూ సుధీర్ మీద కౌంటర్ వేసింది.
![]() |
![]() |